కౌన్సిలర్ ఎలమందల నర్సయ్యకు ఘన సన్మానం…..
17వ వార్డు అభివృద్ధికి కృషి చేయాలి.
కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుండి కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఎలమందల నర్సయ్యను మిత్రమండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మిత్రమండలి అధ్యక్షులు మేకల వెంకట్రావు మాట్లాడుతూ నర్సయ్య లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు పైడిమర్రి సత్తిబాబు, మందడి రంగారెడ్డి, పోటు రంగారావు, కందిబండ సత్యం,ముత్తినేని సైదయ్య, తాళ్లూరి నరసింహారావు, పాశం నాగిరెడ్డి, కోదాటి నరసింహారావు,నెల్లూరు వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, శ్రీనివాసరావు, బాల్ రెడ్డి, రాంబాబు, రవి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
