దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ని ఆహ్వానించిన ఆలయ కమిటీ
కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం, తాడంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనమండలి సభ్యులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేలా స్థానిక ప్రజలు, దాతలు, అన్ని వర్గాల వారి సహకారంతో ఈ విధంగా దేవాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి దేవాలయాలు నిర్మించిన పండగలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా
గ్రామాల్లో ఐక్యత పెరుగుతుందని అన్నారు. యువత ఆధ్యాత్మిక విలువల వైపు మళ్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ, ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు.యువత ఇదే విధంగా ఐక్యతతో ఆధ్యాత్మికతతో పాటుగ్రామాభివృద్ధి ,సామాజిక బాధ్యతల అంశాలలో సేవా భావంతో ముందుకు సాగాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.
రాజేంద్రప్రసాద్ గారిని ఆహ్వానించిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
