ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలి
- స్వచ్ఛ రథాలను పంపిణీ చేసిన కావలి ఎమ్మెల్యే
పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దగదర్తి, బోగోలు మండలాలకు మంజూరు అయిన 34 స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా బోగోలు, దగదర్తి మండలాల్లోని వివిధ గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. స్వయంగా రిక్షాను నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో బోగోలు ఎంపీడివో సుబ్రహ్మణ్యం, దగదర్తి ఎంపీడివో వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మాలేపాటి నాగేశ్వరరావు, చిలకపాటి వెంకటేశ్వర్లు, అల్లం హనుమంతరావు, జలదంకి శ్రీహరి నాయుడు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
