కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ సఫ్దర్ నగర్‌లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను స్థానిక సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో నివసిస్తున్న ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను తమ దృష్టికి తీసుకురాటంతో గతంలో మేము జలమండలి జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మురుగునీటి నిల్వలు, దుర్వాసన, వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం వంటి సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పనులు నాణ్యత ప్రమాణాలతో కొనసాగాలని, ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించినట్లు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తానని మాజీ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, షానవాజ్, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
