తేది. 06.03.2026 నుండి 08.03.2026 వరకు దేవస్థానంలో జరిగే కుంభాభిషేకం కార్యక్రమం

Spread the love

తేది. 06.03.2026 నుండి 08.03.2026 వరకు దేవస్థానంలో జరిగే కుంభాభిషేకం కార్యక్రమం నిమిత్తం – ఉదయం విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాధ్ (చిన్ని ), జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ, నగర పోలీస్ కమిషనర్ శ్రీ రాజ శేఖర్ బాబు ఆధ్వర్యంలో కోర్డినేషన్ మీటింగ్ – ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఛాంబర్లో నిర్వహించారు.
ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఈవో శ్రీ శీనానాయక్, వైదిక కమిటీ సభ్యులు శ్రీ కోట ప్రసాద్, ఎల్. దుర్గా ప్రసాద్, శ్రీ ఎం. షణ్ముఖేశ శాస్త్రి, శ్రీ వి.శ్రీధర్ వార్లు గతంలో జరిగిన కుంభాభిషేకం నిమిత్తం చేసిన ఏర్పాట్లు గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీ కోటేశ్వరరావు, ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీ బడేటి ధర్మారావు,శ్రీమతి జి. సరోజినీ దేవి, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వెలగపూడి శంకర బాబు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top