ఘనంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు

Spread the love

ఘనంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు

** 896వ సంవత్సరం వేడుకలు అదృష్టం

** వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నేత గుండాల గోపినాథ్

తిరుపతి: క్రీస్తుశకం 1118వ సంవత్సరంలో ఆవిర్భవించినట్లు కొన్ని శాసనాలు స్పష్టంగా తెలియజేస్తున్న పవిత్రక్షేత్రం తిరుపతి నగరం అని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి 896వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గుండాల గోపి మాట్లాడుతూ
ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న తిరుపతి నగరాన్ని పూర్వకాలంలో వెంకటనాధపురం, గోవిందపట్నం అని పిలిచేవారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.
తిరువెంగడం యాదవ రాజుల పాలనలో తిరుపతి అభివృద్ధి చెందిందని, వారు నగరాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమేణా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందిన తిరుపతి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ వేడుకలను రాయలసీమ రంగస్థలి కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వందలాది మంది కళాకారులు పురాణ పురుషుల వేషధారణలో తిరునగర వీధుల్లో గోవింద నామసంకీర్తనలతో భజనలు, కోలాటాలు ఆడుతూ విశేష ప్రదర్శనలు ఇచ్చారు. నగరమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగింది.


ఈ సందర్భంగా నగరవాసులు, కళాకారులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా విశ్వవ్యాప్త ఖ్యాతిని సొంతం చేసుకుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి నగర పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మునినాధ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాస్కరాచారి, అన్నా రెడ్డి రాజశేఖర్, శాంబోలా హరినాథ్, మిట్టపల్లి బ్రహ్మానందం, సిద్దవరం వెంకటాద్రి, కోటి, మునికృష్ణ, శ్రావణి, జయమ్మ, అరుణ, విగ్రహాల కళ్యాణి, సిద్ధమ్మ, పద్మావతి, పార్వతి, మధు, భాస్కర్, మునేంద్ర రెడ్డి, ప్రవచనకర్త చంద్రమౌళి, పురోహితుడు సురేష్ స్వామి, సామాను ఉదయభాస్కర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, విరూపాక్షి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top