క్యాన్సర్ కి నారాయణ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు
పీ.హెచ్.పీలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలి
డా. ఎన్. శ్రీవిద్య.
నెల్లూరు జిల్లా నారాయణ ఆంకాలజీ బ్లాక్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు సిటీ పీ.హెచ్.పీ సభ్యులకు క్యాన్సర్ పై అవగాహన.నారాయణ హాస్పిటల్లో క్యాన్సర్ వైద్య సేవలను ప్రారంభించి విజయవంతంగా ఏడాది పూర్తయిన సందర్భంగా , నారాయణ హాస్పిటల్ ఏజిఎం అలిమిలి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో జిల్లా పీ.హెచ్.పీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ అధ్యక్షతన నారాయణ ఆంకాలజి వైద్యులను కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నెల్లూరు సిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.అనంతరం జరిగిన క్యాన్సర్ అవగాహన సదస్సులో మెడికల్ ఆంకాలజిస్ట్ డా.యన్.శ్రీవిద్య మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు వ్యాధులగురించి అవగాహన కల్పించడంలో, ప్రాధమిక వైద్య సేవలు అందించడంలో పి.హెచ్.పిలు పాత్ర కీలకమైనదని, క్యాన్సర్ వ్యాధి నివారణ, స్క్రీనింగ్ పరీక్షల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలన్నారు.
సర్జికల్ ఆంకాలజిస్ట్ డా.బి.మనోభిరామ్ మాట్లాడుతూ క్యాన్సర్ కి సంబంధించిన అన్ని రకాల చికిత్సలు నారాయణలో అందుబాటులో ఉన్నాయని, ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ ను ప్రాధమికదశలో గుర్తించడం ద్వారా నయంచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వార్షికోత్సవం సందర్భంగా మమ్మల్ని అభినందించిన పి.హెచ్.పి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏ.జీ.ఎం. అలిమిలి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పి.హెచ్.పి అసోసియేషన్ నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, నరసాపురం ప్రసాద్, పి.మోహన్, నెల్లూరు సిటీ సభ్యులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
