సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ను టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి హైటెక్స్ లోని అమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ వన్ హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 8న జరగనున్న భారీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెకు పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాల్సిందిగా కోరారు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు రమేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్యం శ్రీరంగం , గాలి బాలాజీ,తూము వేణు,శేరి సతీష్ రెడ్డి, సాదు ప్రతాప్ రెడ్డి,కొప్పిశెట్టి దినేష్ కుమార్ ,గొట్టిముక్కల వెంకటేశ్వరరావు , కృష్ణ రాజ్ పుత్, రంగమోహన్ ,మస్తాన్ రెడ్డి, వినోద్ ,తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
