గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్‌లోని పీరజాదిగూడ పార్వతి కాలనీలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి సహిత కామరాతి, అక్క మహంకాళి దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు,హాజరై దేవతల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పీరజాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు , మాజీ ప్రజా ప్రతినిధులు స్థానిక కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను భక్తి భావంతో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
