అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి….
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి/ అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
సుల్తానాబాద్ పట్టణం మార్కండేయ కాలనీ కు చెందిన గంగాదేవి శ్రీనివాస్ దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ, దరఖాస్తు చేసుకోగా పీడీ డీఆర్డిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
భోజన్న పేట గ్రామానికి చెందిన ఆవుల వసంత తమ గ్రామంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న సమయంలో నిర్మాణ పనులను కొందరు అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారని, ఇంటర్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారి కు రాస్తూ విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన సంపూర్ణ తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిందని, బేస్మెంట్ వరకు నిర్మాణం చేసినప్పటికీ మొదటి విడత బిల్లు డబ్బులు రాలేదని ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
