ప్రతి పల్లెలో నగరాల్లో అభివృద్ధి….
మహిళలందరికీ కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు నడుస్తుంది….
-ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి// గోదావరిఖని లో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని 5కే రన్ లో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కి సహకరించాలని పట్టణ ప్రజలతో మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్య తెలంగాణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రజలు ఇంటి తోపాటు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఎవరో వస్తారని ఎదురు చూడకుండా కాలనీలో సమస్యలను మనమే పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్దతతో పని చేస్తుందన్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని యువత జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.శుభ్రత ప్రమాణాలను పాటిస్తూ రాష్ట్రాన్ని దేశానికి రోల్డ్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
