
అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించాలి….
ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….
పెద్దపల్లి// .సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ప్రతి ఒక్క అధికారి, ప్రభుత్వ సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,కార్యాలయాల్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కార్యాలయాల్లో ప్రతి ఫైల్ పకడ్బందీగా రికార్డు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. కార్యాలయంలో నిరుపయోగంగా (పాడైన) ఉన్న పాత స్కానర్ ,ప్రింటర్ మొదలైన సామాగ్రి తొలగించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను ఎక్కువ సమయం ఎదురు చూసేలా చూడవద్దని, వారి దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాష్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
