
ఎన్టిపిసి సిఐటియు యూనియన్ కు రాజీనామా….
ఏఐటీయూసీ లో చేరిన నాంసాని శంకర్…
కండువా కప్పి ఆహ్వానించిన ఏఐటీయూసీ జిల్లా జనరల్ సెక్రెటరీ కడారి సునీల్…!
పెద్దపల్లి//ఎన్టిపిసి: ఎన్టిపిసి సిఐటియు యూనియను కు రాజీనామా చేసి ఏఐటీయూసీ లో చేరిన నాంసాని శంకర్, అతని అనుచరులకు ఎన్టిపిసి టౌన్ షిప్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కండువలు వేసి సాధారణంగా ఆహ్వానించిన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ.. ఎన్టిపిసి ఏఐటీయూసీ యూనియన్ బలోపేతానికి నాంసాని శంకర్ అతని అనుచరులు కృషి చేయాలని కోరారు, ఎన్టిపిసి కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని హక్కుల పరిరక్షణ కోసం రాజలేని పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. లొకేషన్ లో వివిధ విభాగాలలో కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న పట్టించుకునే వారు కరువయ్యారని, ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు రూపకల్పనకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టిపిసి ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ రెడ్డపాక లక్ష్మణ్, జనరల్ సెక్రెటరీ ఎం శంకర్, నాంసాని శంకర్ ను ఆహ్వానించి స్వాగతం పలికారు, అనంతరం రిటైర్డ్ అయిన డి సుబ్బరాజుకు శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో డి సుబ్బరాజు, ఆర్ రాజు, కే మల్లేష్, కే నారాయణ, చంద్రయ్య, శాంతయ్య, నాగరాజు, లక్ష్మణ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
