
ఆంజనేయస్వామి దర్శనం
** ప్రత్యేక పూజల్లో టీటీడీ జేఏసీ ఫౌండర్
తిరుపతి: తిరుపతిలో టీటీడీ శ్రీనివాసం ఎదురుగా వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారిని టీటీడీ జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ కె. ఆంజనేయులు మంగళవారం దర్శించుకున్నారు. ఇక్కడి
అభయ ఆంజనేయస్వామి
ఈశాన్య ముఖం కార్యసిద్ధితో ఉండడం వల్ల కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి ఉందని ఆంజనేయులు తెలిపారు. ఆస్వామిని మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు చేసుకోవడం ఎంతో అదృష్టం అని తెలిపారు. తిరుపతిలోని స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సందర్శనం ఎక్కువగా ఉంటుందని… స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారని ఆయన చెప్పారు. ఈ పూజల్లో సీనియర్ లీడర్ గజేంద్ర, ఫోటో యూనియన్ మోహన్ రావు కూడా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
