
యడ్లపాడులో బైక్ దొంగ అరెస్ట్…..
ఏడు మోటార్ సైకిళ్లు స్వాధీనం..
ఎడ్లపాడు: పలు మోటార్ సైకిళ్లు దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్థుడిని యడ్లపాడు పోలీసులు అరెస్టు చేశారు.అతని వద్ద నుంచి సుమారు 3 లక్షల రూపాయల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.శిక్షణ డీఎస్పీ జయకృష్ణ ఆదేశాల మేరకు యడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.మండల పరిధిలోని ఎన్ఎస్ఎల్ టెక్స్‌టైల్స్ సమీపంలోని సర్వీస్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.హోండా సిబి యూనికాన్ (AP39QQ3500) మోటార్ సైకిల్ మీద ఉన్న అతను విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన గుడిమెట్ల సాగర్ బాబు (33). అతనిపై తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది.తనిఖీ సమయంలో మరో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని అంగీకరించాడు.
స్వాధీనమైన వాహనాలు..
మూడు హోండా యూనికాన్ బైక్‌లుఒక హీరో హెఫ్ డీలక్స్ఒక హోండా షైన్ఒక టీవీఎస్ ఎక్సెల్ఒక హీరో హోండా స్ప్లెండర్ ప్లస్వీటి మొత్తం విలువ రూ. 3,00,000 పైబడి ఉంటుందని పోలీసులు అంచనా.
ఈ సందర్భంగా శిక్షణ డీఎస్పీ జయకృష్ణ మాట్లాడుతూ, వాహనదారులు తమ వాహనాల భద్రతలో అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదులను చూస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రజలకు సూచించారు.ప్రస్తుతం నిందితుడిపై యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 49/2026, U/s 303(2) బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించమని తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
