కోదాడలో ఘనంగా కోట మైసమ్మ తల్లి ఆలయ 7 వ వార్షికోత్సవం

Spread the love

కోదాడలో ఘనంగా కోట మైసమ్మ తల్లి ఆలయ 7 వ వార్షికోత్సవం..


కోట మైసమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ ఎన్నిక….
కోదాడ పట్టణంలో కొలువై ఉన్న కోట మైసమ్మ తల్లి ఆలయ ఏడవవార్షికోత్సవాన్ని కమిటీ సభ్యులు ఆదివారం కనుల పండుగ గా నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాలు జరిపి తిరోక్క పూలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కరుణా కటాక్షంతో పట్టణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పూజలు జరిపారు. అనంతరం కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కోట మైసమ్మ తల్లి ఆలయానికి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొడ్రాయి పునః ప్రతిష్ట కమిటీ కమిటీ నాయకులు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వేముల రామయ్య, ఉపాధ్యక్షులుగా భీమయ్య, గంధం పాండురంగారావు, చింతల లింగయ్య, ఆలేటి చిన్న సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కోటా శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిలు మంచి కంటి జనార్దన్, లచ్చి మల్ల రామ్మోహన్, మాదాల ఉపేందర్, కోశాధికారిగా కోటగిరి వెంకటనారాయణ, ప్రదన సలహాదారులుగా సట్టు నాగేశ్వరరావు, గంధం రంగయ్య, పందిరి సత్యనారాయణ, సుంకర నాగయ్య తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top