
కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన మండల కమిటీ ఎన్నిక
కోదాడ పట్టణంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 కోదాడ మండల నూతన కమిటీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల సమాచార హక్కు రక్షణ చట్టం అధ్యక్షుడు బాలెబోయిన రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కోదాడ మండల ఉప అధ్యక్షుడిగా కొదుమూరి రామకృష్ణ,గౌరవ అధ్యక్షుడు అమెరబోయిన వీరబాబు,ఆర్గనైజర్ పూసపారి నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాల లచ్చిరెడ్డి,యూత్ కన్వీనర్ శీలం కోటినారి, టౌన్ అధ్యక్షుడు బండి చిన్న కోటయ్య, మీడియా కన్వీనర్ వెలిశాల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ అబ్బురం, జాయింట్ సెక్రెటరీ పొట్టు శ్రీను,కోఆర్గనైజర్ రమేష్ లను ఎన్నుకున్నట్లు అంజి తెలిపారు.
ఈ సందర్భంగా అంజి మాట్లాడుతూ.. నూతన మండల కమిటీకి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం గురించి మండల ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ముందుకు వెళ్లాలని ఆయన నూతన కమిటీకి పిలుపునిచ్చినారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు.. బాలెబోయిన రామారావు మాట్లాడుతూ.. నా ఎన్నికకు సహకరించిన జిల్లా, నియోజవర్గ కమిటీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు రక్షణ చట్టం గురించి ప్రజలకు వివరిస్తూ, సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గెల్లా పవన్ కుమార్, సమాచార హక్కు రక్షణ చట్టం మునగాల మండల అధ్యక్షుడు ఆకారపు వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన మండల కమిటీని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి సన్మానించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
