
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తుడ చైర్మన్
** డాలర్స్ దివాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
తిరుపతి: వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరంలో పాల్గొని, దక్షిణ కొరియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సోమవారం తిరుపతి నగరానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా తుడా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలవాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
తుడా అధికారులు మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తిరుపతి ప్రాంత అభివృద్ధి…పర్యావరణ పరిరక్షణపై తుడా చేస్తున్న కృషిని చాటి చెప్పడం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి గర్వకారణమని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల ప్రతినిధులు పాల్గొన్న ‘వరల్డ్ క్లైమేట్ సిటీస్ ఫోరం’లో తిరుపతి నగరం తరపున డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడం జరిగిందన్నారు. వాతావరణ మార్పులు, హరిత నగరాల నిర్మాణం… సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి అంతర్జాతీయ నిపుణులతో ఆయన జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచ వేదికపై మన తిరుపతి అభివృద్ధిని చాటిచెప్పడం గర్వకారణం. అక్కడ నేర్చుకున్న అత్యాధునిక సాంకేతికతను, పర్యావరణ పరిరక్షణ పద్ధతులను మన తుడా పరిధిలో అమలు చేసి, తిరుపతిని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా.యన్వి శ్రీకాంత్ బాబు, ఎస్ఈ రవీంద్రయ్య, సీపిఓ దేవికుమారి, భూసేకరణ అధికారి సుజన, హార్టికల్చర్ మాలతి, పరిపాలన అధికారి శైలజ, జెపిఓ, ఏపీఓ , ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
