
- ప్రతిభ, నైతిక విలువలు,నాణ్యమైన విద్యకు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం వేడుక
వనపర్తి :
నాణ్యమైన విద్యతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తమిళనాడులోని కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం (డీమ్డ్ యూనివర్సిటీ)లో ప్రవేశాలపై వనపర్తిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. శ్రీ కంచి కామకోటి పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1993లో స్థాపితమైన ఈ విశ్వవిద్యాలయం నాణ్యమైన విద్యతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 70 శాతం మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత ఇంజినీరింగ్ విద్యతో పాటు హాస్టల్ ఫీజుల్లో రాయితీలు అందిస్తున్నామని వెల్లడించారు.
విద్యార్థులను చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతూ విలువలతో కూడిన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలలో నాణ్యమైన శాఖాహార భోజనం, ప్రశాంతమైన విద్యా వాతావరణం, ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సెలింగ్ కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, జగిత్యాల, వరంగల్, పాల్వంచ, నంద్యాల, ఆదోని, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో జులై 1 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం 96290 01144, 98496 58030 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ముళ్లపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ వెంకటరమణ, ఆర్యవైశ్య సంఘం వనపర్తి పట్టణ అధ్యక్షుడు బచ్చు రాము, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అయ్యగారు చంద్రశేఖర్ శర్మ, రావుస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
