
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ నిబ్ధతతో విధులు నిర్వహించాలి…… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
వనపర్తి :
జిల్లాలో
ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగానికి సార్థకత ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
డి.ఆర్.ఒ. యం. సూర్యప్రకాష్, డి. సెక్షన్ సూపరింటెండెంట్ డి. మదన్ మోహన్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవి విరమణ చేస్తున్న డి.ఆర్. ఒ సూర్య ప్రకాష్, డి. సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్ వనపర్తి జిల్లాకు మంచి సేవలు అందించారని కొనియాడారు. మదన్ మోహన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుదీర్ఘంగా సేవలు అందించారని చెప్పారు. నిస్వార్థంగా నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తే భగవంతుడు ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకు మంచిని చేకూరుస్తారని అన్నారు. జిల్లాలో యువ ఉద్యోగులు చాలా మంది ఎంపిక అయ్యారని అందరూ నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
పదవి విరమణ పొందుచున్న డి.ఆర్.ఒ సూర్యప్రకాష్, మదన్ మోహన్ వారి అనుభవాలను పంచుకున్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పదవి విరమణ పొందిన సూర్య ప్రకాష్, మదన్ మోహన్ లను ఘనంగా సత్కరించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
