
యూరియా యాప్ ను రద్దు చేయాలి.
వి . బి . జి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలి
ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కోట మధుసూదన్ రెడ్డి
మోతే :
మండల కేంద్రంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు అఖిలభారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కునుకుంట్ల సైదులు. జిల్లా సహాయ కార్యదర్శి కోట మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, కల్తీ విత్తనాలు . ఎరువులు మందులను అరికట్టాలని. రైతులకు రైతు భరోసా ఖాతాలో జమ చేయాలని. రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని గత సంవత్సరం యాప్ ద్వారా ఇవ్వడంతో రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరిగి అలాంటి సమస్యలు పునరావత్వం కాకుండా ఉండాలంటే తక్షణమే యాప్ ను రద్దు చేయాలి. కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వి బి జి రామ్ జి పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ఉపాధి హామీ కూలీలను జీవించే హక్కు లేకుండా ప్రజల హక్కులను కాల రాస్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక పోరాటాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పొడపంగి ముత్తయ్య. ఉప సర్పంచ్ ఎస్.కె హైమద్ బాబా, ఏఐకేఎంఎస్ గ్రామ అధ్యక్షులు ఎర్రబోయిన లింగయ్య కార్యదర్శి నిమ్మల మల్లయ్య. మోత్కూరి వీరాచారి. అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి. కుడిదల లింగయ్య. జె ల వెంకన్న. ఆవులు ఎలమంచి. బాలాజీ. లింగ. వేల్పుల లింగయ్య. ఎర్రబోయిన ఎంకన్న. కొంచెం ఇదయ్య. దాసరి వీరన్న. నరసయ్య. అడపు వెంకన్న. ఎర్రబోయిన పుల్లయ్య. నాగరాజు. సౌడయ్య. కొడదల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
