
మాటకు విలువ… కార్యకర్తలకు భరోసా…
కష్టకాలంలో అండగా వ్యాల్ల హరీష్ రెడ్డి….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, మాట ఇచ్చి నిలబెట్టుకోవడమే నిజమైన నాయకత్వమని మరోసారి నిరూపించారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామగుండం నియోజకవర్గ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి.
రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోదావరిఖని ఎన్‌టీపీసీ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమిడి రామును పరామర్శించిన సందర్భంగా, “అవసరమైతే అండగా ఉంటాను” అని హామీ ఇచ్చిన హరీష్ రెడ్డి , నేడు తన మాటను నిలబెట్టుకుంటూ వారి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా హరీష్ రెడ్డి గారు తన మానవత్వాన్ని, కార్యకర్తల పట్ల ఉన్న ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రెడ్డి సేవాభావాన్ని అభినందిస్తూ, కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ఆయన నిరంతరం ముందుండి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, కొండా సురేష్, ఎండి. నిజాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
