
సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజలకు చేయూత.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరి నగర్ వాస్తవ్యులు కావలి బాబు సతీమణికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఆసుపత్రి ఖర్చులకు రెండు లక్షల రూపాయలను సిపిఐ ఎమ్మెల్యే కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ద్వారా సీఎం సహాయనిధి తరపున 2 లక్షల రూపాయలను ఇప్పించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ తరపున పేద ప్రజలకు నిత్యం తోడ్పాటు అందించడంలో భాగంగానే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు వారి ఆరోగ్య అవసరాల కోసం గత రెండు సంవత్సరాల నుంచి జగద్గిరిగుట్ట డివిజన్,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అనేకమందికి సీఎం సహాయనిధి ద్వారా డబ్బులు ఇప్పించామని దాని ద్వారా లబ్ధి పొందిన ప్రజలు సిపిఐ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేయడం చాలా సంతోషకరమని ప్రజలు కూడా సిపిఐ చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాములు ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్ శాఖ నాయకులు చంద్రయ్య కరుణాకర్ బాలకృష్ణ చంద్రమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
