
శంభీపూర్‌లో SIR హెల్ప్ డిస్క్‌ను పరిశీలించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 296 డివిజన్ దుండిగల్ పరిధిలోని శంభీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డిస్క్ కార్యక్రమాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రజలు ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు తాగునీటి సమస్య, గ్రామ చెరువు ఆక్రమణలపై స్పందించిన కొలను హన్మంత్ రెడ్డి చెరువు ప్రాంతాన్ని పరిశీలించి, ఆక్రమణలను తొలగించి చెరువును పరిరక్షించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రెండు బోర్‌వెల్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు అమరం ముత్యం రెడ్డి, దుండిగల్ డివిజన్ అధ్యక్షుడు జక్కుల మల్లేష్, దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, పీసరి మహేందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, సంగొళ్ల నాగేష్, క్యాసారం సత్తయ్య, సంగొళ్ల శంకర్, మనోహర్, గురువా రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
