
పదోన్నతితో బాధ్యత మరింత పెరుగుతుంది..
సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి…
— సీపీ అంబర్ కిషోర్ ఝా…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, పోలీసు శాఖలో పదోన్నతి ప్రతి ఉద్యోగికి గర్వకారణమే అయినప్పటికీ, దానితో పాటు బాధ్యత కూడా మరింత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. అప్పగించిన విధులను నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహించాలని పదోన్నతి పొందిన అధికారులకు సూచించారు.
ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఎ. సత్తయ్య, పి. వెంకన్న గౌడ్, ఎం.ఎ. హబీబ్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరగడం మాత్రమే కాదని, ప్రజల పట్ల బాధ్యత, సేవాభావం కూడా మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
అంతేకాకుండా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో మరింత చొరవ చూపుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలని పదోన్నతి పొందిన అధికారులకు సీపీ ఆకాంక్షించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
