
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సోదరుడి కుటుంబాన్ని పరామర్శించిన, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సోదరుడు ధర్మేందర్ సింగ్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కోరుకంటి చందర్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ధర్మేందర్ సింగ్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామగుండం పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, మూల విజయ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 58వ.డివిజన్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య యాదవ్, 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల రమేష్, నడిపెల్లి మురళీధర్ రావు, నారాయణదాసు మారుతి, దొమ్మటి వాసు తదితరులు పాల్గొని మృతురాలికి ఘన నివాళులర్పించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
