
ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం..
ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్..
కోదాడ, ఇంకుడు గుంతలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఎంపీడీవో ఇస్సాక్ హుస్సేన్ అన్నారు. మండల పరిధిలోనిగుడిబండ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ ఇసాక్ హుసేన్ పాల్గొని గ్రామానికి చెందిన ఆవుల భద్రారెడ్డి, నవీన్ వారి ఇంటి వద్ద ఎంపీడీఓ ఇసాక్ హుసేన్ ఇంకుడు గుంత కోసం ముగ్గు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, గుడిబండ గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించే ఈ ఇంకుడు గుంతలు నీటి మట్టాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మందుల నాగయ్య, ఎంపీఓ రాంబాబు, ఏపీఓ తానియా, వైస్ సర్పంచి జేయసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి, బొత్తుల నరశెట్టి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
