
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం….
నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి….
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజలకు మరింత చేరువగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి అంశాలపై నాయకులతో ఎమ్మెల్యే చర్చించారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
