దేశ సమగ్రతకు ప్రతీకగా ‘హర్ ఘర్ తిరంగా’.

Spread the love

దేశ సమగ్రతకు ప్రతీకగా ‘హర్ ఘర్ తిరంగా’….

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి,
స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని యువత కొనసాగించాలి….

— కొండపర్తి సంజీవ్ కుమార్…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
దేశ సమగ్రత, ఐక్యతను చాటేలా భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ కార్యక్రమాన్ని గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశా,,లలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ జిల్లా కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండాను దేశంలోని ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని విద్యార్థులు, యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపింపజేసి దేశభక్తి, ఐక్యతా భావాన్ని చాటారు.

హర్ ఘర్ తిరంగా నియోజకవర్గ కన్వీనర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోమల్ల మహేష్, మేరుగు హనుమంత్ గౌడ్, సోమారపు లావణ్య, కాశీపేట శివాజీ, కందుల సంధ్యారాణి, చిలుక భారతి, జక్కుల నరహరి, సుల్వ లక్ష్మీ నరసయ్య, మాతంగి రేణుక, శ్రావణ్, అపర్ణ, మిట్టపల్లి సతీష్, గుండబోయిన భూమయ్య, ఆకాష్ గౌడ్, జనగామ శివరామకృష్ణ, కొమ్మల స్వామి యాదవ్, సిలువ పద్మ, మడికొండ శ్రీనివాస్, సిరిశెట్టి మల్లేష్, సిలివేరి అంజి, అంకార్ భరత్, శివకుమార్, కన్నూరి భాస్కర్, ఆడెపు కార్తీక్, ఆకునూరి తిరుమల, ఎల్తురి సరితా రాజయ్య, శంకర్, చెన్నూరి రమేష్, జనగామ సాగర్, కుంభాల రాజు, బూడిద రమేష్, కుమ్మరి మల్లేష్, జక్కన్న బాలు, పంగ రవి, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top