
SIR-2026 కార్యక్రమంలో BLAలు, సీనియర్ నాయకులకు ఘన సన్మానం ||
AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు బహదూర్‌పల్లి పరిధిలోని మేకల వెంకటేశం ఫంక్షన్ హాల్‌లో SIR-2026 కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్, బౌరంపేట్, బహదూర్‌పల్లి డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ BLAలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఏ.పీ. మిథున్ రెడ్డి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ , మాజీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి , స్టేట్ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి , DCC కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా SIR-2026 కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన BLAలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.
నాయకులు మాట్లాడుతూ SIR-2026 కార్యక్రమంలో బూత్ స్థాయిలో BLAలు, నాయకులు మరియు కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఓటర్ల వివరాల పరిశీలన, అర్హులైన ఓటర్లకు సంబంధించిన ప్రక్రియలో బాధ్యతాయుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు తెలియజేశారు.
అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే నిబద్ధత, సమన్వయం మరియు అంకితభావంతో పనిచేస్తూ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు, BLAలు, డివిజన్ నాయకులు మరియు సీనియర్ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే దిశగా సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
