
న్యూ శివాలయ నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తా: కూన శ్రీశైలం గౌడ్ గారు
కుత్బుల్లాపూర్: సూరారం డివిజన్ పరిధిలోని న్యూ శివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సందీప్ రెడ్డి, కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, ప్రభుత్వం తరఫున కూడా కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.
అదేవిధంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ న్యూ శివాలయ నగర్ కాలనీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.
అదేవిధంగా నియోజకవర్గనికి చెందిన పలువురి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో న్యూ శివాలయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ రెడ్డితో పాటు ప్రదీప్, రేవంత్ కుమార్, జానకిరామ్, కరుణాకర్, రవి, శ్రీనివాస్, విజయ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు నాగిల్లు శ్రీనివాస్, చౌడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
