కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌

Spread the love

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌

హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు , రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు.

ఆధునిక వసతులతో, గౌరవప్రదమైన జీవనానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని సీఎం పేర్కొన్నారు. మొదటి విడతలో లక్ష ఇళ్లను నిర్మించి అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top