
రూ.30 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి నగర్ డివిజన్ లోని రంగారెడ్డి నగర్ లో రూ.30 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. కాలనీల్లో రోడ్ల సమస్యను పరిష్కరించేందుకు రూ.30 లక్షల నిధులు మంజూరు చేసి విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల ప్రాథమిక అవసరాలను పట్టించుకోకుండా, అనేక ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని కూన శ్రీశైలం గౌడ్ విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను గత పాలకులు విస్మరించారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తూ పనులను చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కూన శ్రీశైలం గౌడ్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోతే శ్రీనివాస్ యాదవ్, జి రమేష్, బాలరాజు, రమేష్ మంజూల్కర్, కాజా బాయ్, తిమ్మయ్య, పురుషోత్తం, మాధవి, నయీమ్, ఆనంద్ గౌడ్, షకీర్, మల్లం శ్రీను, నారాయణ, రాకేష్, జ్ఞానేశ్వర్ రెడ్డి, తోకలా శ్రీనివాస్, శ్యామల, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
