
SIR-2026 కార్యక్రమంలో BLAలు, సీనియర్ నాయకులకు ఘన సన్మానం ||
AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో SIR-2026 కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , మాజీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి , మాజీ కొర్పొరేటర్ కె .ఎమ్ గౌరీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దమ్మని శ్రవణ్ కుమార్, బేకు శ్రీనివాస్, DCC కమిటీ సభ్యులు జాకీర్, లక్ష్మి చౌదరి, గొరిగే బాలప్ప, మహిళా కాంగ్రెస్ నాయకులు సుజాత యాదవ్ , సుజాత, పల్లవి, అశ్విని, రేవతి మరియు తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పెట్ బషీరాబాద్, పద్మ నగర్, గణేష్ నగర్, కుత్బుల్లాపూర్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ BLAలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, ఇరుగు రాధా కృష్ణ, గడ్డం రాజేందర్ రెడ్డి , పిట్ల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా SIR-2026 కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన BLAలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు.
నాయకులు మాట్లాడుతూ SIR-2026 కార్యక్రమంలో బూత్ స్థాయిలో BLAలు, నాయకులు మరియు కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఓటర్ల వివరాల పరిశీలన, అర్హులైన ఓటర్లకు సంబంధించిన ప్రక్రియలో బాధ్యతాయుతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు తెలియజేశారు.
అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇదే నిబద్ధత, సమన్వయం మరియు అంకితభావంతో పనిచేస్తూ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
