
10 రోజులైన స్పందించని రెవెన్యూ అధికారులు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
జగద్గిరిగుట్ట డివిజన్లో జరుగుతున్న భూకబ్జాలపైన అటు సిపిఐ నాయకులు మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు వినతిపత్రం ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వాటిని కూల్చాల్సిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు.
వినతి పత్రం ఇచ్చినప్పుడు కూల్చివేస్తామని చెప్పి కూల్చివేయకుండా తాత్సారం చేయడం వల్ల కబ్జాదారులు తాత్కాలిక నిర్మాణాల నుండి శాశ్వత నిర్మాణాలుగా చేసుకుంటున్నారని గత కొద్ది రోజుల నుండి కుత్బుల్లాపూర్ మరియు జగద్గిరిగుట్ట ప్రాంతాలలో కబ్జాలు మరింత పెరిగిపోతున్నాయని గతంలో కూల్చిన స్థలంలో నేడు మళ్ళీ నిర్మాణాలు జరుగుతున్నాయని వీటన్నిటికీ కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. జగద్గిరిగుట్ట ఆలయ స్థలంలో భూములను కాపాడుకోవడానికి సిపిఐ ఆధ్వర్యంలో అందరినీ ఏకం చేసి కార్యాచరణ ప్రకటిస్తామని దీనికి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
