కళ్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నిరసన.

Spread the love

కళ్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నిరసన.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని రిక్షాపుల్లర్స్ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని స్థానిక మహిళా నాయకురాలతో కలసి మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాధవరం రోజాదేవి రంగారావు గారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. పేద కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో భరోసా ఇచ్చాయని, వివాహ సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే ఈ పథకాలను రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. మహిళలకు ఇచ్చే కెసిఆర్ కిట్టు,ఆడపిల్ల పుడితే 14000 రూపాయలు మగ పిల్లవాడు పుడితే 13000 రూపాయలు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సాయం వెంటనే అమలు చేయాలని అన్నారు. బతుకమ్మకి ఇచ్చే చీరలను మూడు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదని ఈసారైనా ప్రతి మహిళకి బతుకమ్మ చీరలు ఇవ్వాలని, ఒంటరి మహిళా పెన్షన్లు, ఆసరా పింఛన్లు కొత్తగా మంజూరు చేయకపోగా అమలు అవుతున్న పింఛన్లను చాలామందికి నిలిపివేశారని అవి వెంటనే వారందరికీ అందజేయాలని అన్నారు.

ఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పెళ్లి చేసుకునే పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన సమయంలో పథకాలను నిలిపివేయడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు.

కళ్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న చెక్కులు, ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి జాప్యం లేకుండా పథక ప్రయోజనం అందించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తుందని సరమైతే మహిళలందరితో కలిసి ఎమ్మెల్యేలను ,సీఎం ఆఫీస్ ,అసెంబ్లీను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, జగదీష్ గౌడ్, ఆంజనేయులు, ప్రవీణ్, యశ్వంత్, రాధిక, లక్ష్మీకాంతమ్మ, శైలజ, సింధు, కరుణ, శ్రావణి, అనిత, శిరీష, జ్యోతి, ఉమా, వెంకన్న, రామచందర్ , మోహన్ చారి ,నరేష్ ,రవి, జై, వెంకటేశ్వరరావు, కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top