ఇందిరాగాంధీ నగర్‌లో రూ.48 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Spread the love

ఇందిరాగాంధీ నగర్‌లో రూ.48 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కుత్బుల్లాపూర్: గిరినగర్ డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్‌లో రూ.48 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెద్దఎత్తున అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

భవిష్యత్తులో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇందిరాగాంధీ నగర్‌లో చాలా ఏళ్లుగా అర్ధాంతరంగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, CMC కమిషనర్ సృజన, IASలకు కూన శ్రీశైలం గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు జైరామ్, ఆరవ వెంకటరమణ,గోపాల్ యాదవ్, శంకర్ గౌడ్,, రఫీక్, నవాజ్, మోతే శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రావు, చోటు, రిజ్వాన్, మోహన్ గౌడ్, నర్సింగ్ రావు, బలరాం, షకీల్, కృష్ణా, నాగేష్ యాదవ్, శ్రీధర్ యాదవ్, ఆక ఖాన్, సంతోష్ భట్,గోపి యాదవ్, యాదయ్య,శ్యామల తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top