
గాజులరామారంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలపై కూన శ్రీనివాస్ గౌడ్ పర్యటన
మేడ్చల్–మల్కాజ్‌గిరి: గాజులరామారం విలేజ్‌లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు పరిధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికుల విన్నపం మేరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ గురువారం స్థానిక మున్సిపల్, జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చేపట్టాల్సిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అంచనాలు, ఎస్టిమేషన్లు దగ్గరుండి పరిశీలించారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన ప్రారంభించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కూన శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారి డీజీఎం రవి, కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, బుచ్చిరెడ్డి, యాము సాగర్, ఈ సురేష్, కే ఋషి, సంజీవరెడ్డి, సత్యనారాయణ, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీరాములు, యాదగిరి, దర్శన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, సుజిత్ రెడ్డి, బుచ్చయ్య గౌడ్, చంద్రశేఖర్, ఆంజనేయులు, ఈ వెంకటేష్, హరి, శ్రీశైలం, ప్రశాంత్, విద్యా సాగర్, లక్ష్మణ్ తో పాటు స్థానిక జలమండలి, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
