
రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గిరి నగర్ డివిజన్ ఇందిరా గాంధీ నగర్‌లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను, యువతకు ప్రాధాన్యతనిస్తూ సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన మార్పులను స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని శ్రీ కూన శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
