
96 లక్షలరూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
చింతల్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో చింతల్ పరిధిలోని రంగనగర్, దుర్గయ్యనగర్ కాలనీలలో రూ.96 లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
రంగనగర్‌లో రూ.60 లక్షల వ్యయంతో వరుద నీటి మురుగు కాలువ నిర్మాణానికి (స్ట్రాం వాటర్ డ్రైన్), దుర్గయ్యనగర్‌లో రూ.36 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, గతంలో తాను చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు…
ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు..
అనంతరం కాలనీవాసులు స్థానిక సమస్యలను, ముఖ్యంగా మంచినీటి విడుదల సమయాన్ని పొడిగించాలని శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ స్థానిక జలమండలి అధికారులతో మాట్లాడి మంచినీటి సరఫరా సమయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మధు, లక్ష్మణ్, నాగరాజు, అఖిల్ గౌడ్, సాయి యాదవ్, అనంత్ రావు, పద్మ, లాల్ మేస్త్రి, దుర్గయ్యనగర్ కాలనీ అధ్యక్షుడు సురేష్, అక్బర్, నాగేశ్వరరావు, షేక్ మీర్, రూప, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
