
జానపద కళాకారులకు ఘన సన్మానం….
జానపద కళలకు జేజేలు.. 15 మంది కళాకారులకు ‘జానపద పురస్కారాలు’…..
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని// : కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ గోదావరిఖని ఆధ్వర్యంలో ప్రపంచ జానపద కళల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోదావరిఖని ఆర్టీసీ డిపో సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
జానపద కళల పరిరక్షణ, అభివృద్ధికి విశిష్ట సేవలు అందిస్తున్న 15 మంది జానపద కళాకారులను ‘జానపద పురస్కారాలతో’ ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో పాటు పలువురు కళా, పాత్రికేయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
జానపద పురస్కారాలకు ఎంపికైన వారిలో ఆరెల్లి లక్ష్మీకళ, అల్లాడి లలిత, బట్టల గీత, పులిపాక బానయ్య, మొల్గూరి సమ్మయ్య, పొన్నగంటి రాజనర్సు, చిలుక సమ్మయ్య, బొమ్మక వంశీ, అమరగాని శ్రీనివాస్, వడ్లకొండ రవివర్మ, కనకం శంకర్, అంబాల రాజయ్య, చానకొండ రవీందర్, మోరే దేవయ్య, రాజు డప్పిస్టు (ప్రజానాట్యమండలి) ఉన్నారు.
జానపద కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, వాటిని భావితరాలకు అందించేందుకు కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలకు కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
