
గన్ శ్యామ్ దాస్ నగర్‌లో సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం….
గ్రామాభివృద్ధికి రూ.15 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులు.. డ్రైనేజీ పనులు ప్రారంభం….
పెద్దపల్లి- పాలకుర్తి// : మండలంలోని గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామంలో అభివృద్ధి పనుల్లో భాగంగా సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సూర రమ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
గ్రామంలో అభివృద్ధి పనులకు డీఎంఎఫ్‌టీ నిధులు కేటాయించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించి గ్రామానికి రూ.15 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ నిధుల్లో భాగంగా రూ.5 లక్షల వ్యయంతో ఓర్సు ఎల్లస్వామి ఇంటి నుంచి నర్ర కుమార్ ఇంటి వరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే మురుగు నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గ్రామంలో పారిశుధ్యం మెరుగుపడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, నిధుల కోసం కృషి చేసిన డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ సూర సమ్మయ్యకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముత్యాల ఉదయ్, వార్డు సభ్యులు కోమిరే జ్యోతి రాజు, కంకటి శ్రీనివాస్ గౌడ్, సూర స్వరూప, సూర చిన్న మల్లయ్య, తపట్ల మోహన్, చొక్కాల వైష్ణవి–ఉదయ్, ఓల్లెపు అంజు కుమార్, సట్ల అశోక్, కొండ్రా సాయి, జంపాల శారద, మాజీ వార్డు సభ్యులు ఓర్సు ఎల్లస్వామి, సంపంగి కుమార్, కోమిరే సురేష్, బాధావత్ శంకర్ నాయక్, కోమిరే శంకర్, ధరంగుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
