“ఇబ్బంది పడుతున్నా ము నీటి సరఫరా పునరుద్ధరించండి” మాజీ ఎమ్మెల్సీ

Spread the love

ఇబ్బంది పడుతున్నా ము నీటి సరఫరా పునరుద్ధరించండి” మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ కి7వ,వార్డు కలవ గట్టు నివాసితముస్లిం మహిళల విజ్ఞప్తి.

ఇటీవల ఉయ్యూరులో అతిసార వ్యాధి నివారణ చర్యలలో భాగంగా పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిని నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు ఐతే తాము నివసించే ప్రాంతానికి ట్యాంకర్ దూరం గా ఉండటం వలన వృద్ధులు, మహిళలు నీటిని తెచ్చుకోలేక పోతున్నామని, మూడు నాలుగు రోజులుగా గృహ అవసరాలకు కూడా నీరు అందటం లేదని కావున గతంలో వాలే పైపుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముస్లిం మహిళలు రాజేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు,

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఉయ్యూరులో కొన్ని ప్రాంతాలలో వాంతులు విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, నీరు కలుషితం వలన అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని భావించిన అధికారులు నీటి సరఫరా నిలిపివేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ లకు పంపించారని అన్నారు, కనుక మన ఉయ్యూరు పట్టణ ప్రజలు కాచి వడపోసిన నీటినే తాగాలని, పరిశుభ్రత పాటించాలని, పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిని ప్రస్తుతానికి గృహ అవసరాలకు మాత్రమే వాడాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే మున్సిపల్ అధికారులకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని,తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రజలు ఇబ్బంది పడకుండా వారి అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులకు రాజేంద్రప్రసాద్ సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాస్,అంజి బాబు,జంపన శ్రీనివాస్ , సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, 7వ,వార్డుమాజీ కౌన్సిలర్ వడుపు కార్తీక్, మాజీ కౌన్సిలర్లు బూరెల నరేష్, పల్యాల శ్రీను, ఆదిల్,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top