
ఫీజు బకాయి – బీజేపీ లడాయి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు సంఘీభావంగా భారీగా పాల్గొన్నాం.
బీజేపీ మెద్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి నాయకత్వంలో, BJYM రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుందే ఆదేశాల మేరకు మెద్చల్–మల్కాజ్‌గిరి అర్బన్ BJYM నాయకులు, కార్యకర్తలు మరియు గాజులరామారం డివిజన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల హక్కుల కోసం తమ మద్దతును తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్ గాజుల రామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి తనయుడు BJYM నాయకులు రావుల పృథ్వి , గరిగె శేఖర్ ముదిరాజ్ ,సాయి నేత ,నరేష్ గౌడ్ , సమంతల రాజు ,శ్రీను , మంజునాథ్ , కార్తిక్ గారు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకునేది లేదు.
ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి!
విద్యార్థులకు న్యాయం చేయాలి!
విద్యార్థుల కోసం పోరాటం…
న్యాయం జరిగే వరకు బీజేపీ–BJYM పోరాటం ఆగదు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
