కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P.వివేకానంద్ గౌడ్ సూచనల మేరకు జోనల్ కమిషనర్ కార్యాలయం

Spread the love

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే K.P.వివేకానంద్ గౌడ్ సూచనల మేరకు జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పణ

కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు, BRS పార్టీ విప్, ఎమ్మెల్యే K.P.వివేకానంద్ గౌడ్ సూచనల మేరకు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.

292 సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో ఉన్న రోడ్లు, నాలా సమస్యలు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు SC. సక్కుబాయి మేడం మరియు DE. లావణ్య మేడం తదితర అధికారులకు వినతి పత్రం అందజేశారు.

స్థానికులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ , కృషి కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ , జనరల్ సెక్రటరీ కిషోర్ ముదిరాజ్ , బద్రి, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top