
బీజేపీ లేబర్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా తడగొండ నర్సయ్య….
ఘనంగా సన్మానించిన రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి…..
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : బీజేపీ లేబర్ సెల్ (కార్మికశాఖ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తడగొండ నర్సయ్యను రామగుండం నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్చార్జ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ఘనంగా సన్మానించారు. ఆమె అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నర్సయ్యను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తడగొండ నర్సయ్యకు పార్టీ నాయకులు అభినందనలు తెలియజేస్తూ, కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో లేబర్ సెల్ కీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కార్మిక వర్గం సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం నర్సయ్య తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు, బీజేపీ నాయకులు గుండబోయిన భూమయ్య, బోడకుంటి సుభాష్, మేరుగు నరేష్ గౌడ్, ఊరగొండ అపర్ణ, కోడూరి రమేష్, సులువ లక్ష్మీనర్సయ్య-పద్మ, పెద్దపల్లి ఎస్సీ మోర్చా అధ్యక్షులు మాచ విశ్వాస్, పెద్దపల్లి మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుక భారతి, జక్కుల పద్మ-ప్రవీణ్, ఎల్తూరి సరిత-రాజయ్య, కొట్టే నరేష్, పాకాల నరసింహారెడ్డి, గంగరాజు, బూడిద హర్ష, జక్కన బాలు, మిస వికాస్, వెంకటేష్, ఇరుగురాల శివకుమార్, జనగామ సాగర్, బుంగ మహేష్, ఎరుకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
