
ఢిల్లీలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ అవార్డ్స్ ప్రధానోత్సవం లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ..
న్యూఢిల్లీ, : దేశ రాజధాని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్‌లో భాగంగా ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె.వి.పి. రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అవార్డులను ప్రతిభావంతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి విశేష కృషి చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు…
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
