
మౌనికను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి
నెల్లూరు జిల్లాకోవూరు మండలం పడుగుపాడు గ్రామంలోని స్టవ్ బిడి కాలనీకి చెందిన కోవూరు జడ్పిటిసి కవరగిరి శ్రీలత–ప్రసాద్ ల కుమార్తె మౌనిక ఇటీవల హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న మౌనికను మాజీ మంత్రి , వైసీపీ రాష్ట్ర పి ఏ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్టవ్ బిడి కాలనీలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా మౌనిక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండూరు అనిల్ బాబు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, షేక్ జుబేర్, యం.డి.గయాజ్ తో పాటు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
