
శ్రీ చాణిక్య పాఠశాలలో.. ముందస్తు జన్మాష్టమి వేడుకలు…
సూర్యాపేట జిల్లా/కోదాడ పట్టణంలోని శ్రీ చాణిక్య పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో సందడి చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి బాల్య ఘట్టాలను ప్రతిబింబించేలా విద్యార్థుల వేషధారణ, నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు శ్రీకృష్ణుడి బోధనలు, సద్గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
