
కళావతి నగర్‌లో మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: 291వ డివిజన్ షాపూర్ నగర్ పరిధిలోని కళావతి నగర్‌లో మల్టీపర్పస్ హాల్ (కమ్యూనిటీ హాల్) నిర్మాణానికి రూ.18 లక్షల నిధులు మంజూరు కాగా, ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని మల్టీపర్పస్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, కళావతి నగర్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పలకృష్ణ, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, డీసీసీ సెక్రటరీ సంతోష్, గాదె వినోద్, కాలనీ సీనియర్ నాయకులు రజితా రత్నం, రజాక్, కృష్ణ, బుచ్చయ్య పతి, అచ్చమ్మ, నరసమ్మ, సంపంగి వెంకటేష్, అరుణ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
